భాష్యం స్కూల్లో తల్లిదండ్రులకు ఫిట్నెస్పై అవగాహన కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లో ఉన్న భాష్యం పాఠశాలలో తల్లిదండ్రులకు ఉల్లాసంగా వివిధ రకముల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ హర్ష గారు ఫిట్నెస్ ట్రైనర్ మరియు లక్ష్మీ సౌజన్య గారు ప్రముఖ న్యూట్రిషన్ ఈస్ట్ రావడం జరిగింది.లక్ష్మీ సౌజన్య గారు మాట్లాడుతూ పిల్లలకు ఇష్టమైన కూరగాయలతో కూరలు చేయడం ద్వారా అదే విధంగా డ్రైఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారా వాళ్లకి కావలసిన పోషకాలు అందుతాయని అదే విధంగా వాళ్లకు ఇష్టమైనవి కాబట్టి ఇష్టపడి తింటారని చెప్పడం జరిగింది మరియు శ్రీహర్ష గారు మాట్లాడుతూ ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేయడం ద్వారా వాళ్లకి కావాల్సిన ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భాష్యంలో ప్రతిరోజు ఉదయం ప్రేయర్ లో ఏరోబిక్స్ ,యోగ మరియు క్యాలసనిక్స్ నేర్పిస్తామని దీనివల్ల పిల్లలు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.ఈ కార్యక్రమంలో జెడిఓ లక్ష్మణ్ గారు, హెచ్ఎం నిరూష, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలు పాల్గొన్నా
No comments:
Post a Comment