ప్రతి భక్తుడు సంతృప్తికరంగా భోజనం చేయాలి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదానం లో ప్రతిరోజు సుమారు 7000 మంది భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. నిత్య అన్నదానం లో అన్న ప్రసాదాలు రుచి నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ఉండేలా దేవస్థానం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు నిత్యాన దానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నిత్యాన్నదానాల్లో నాణ్యమైన వస్తువులను వినియోగిస్తూ అన్నప్రసాదాలు రుచిగా ఉండేలా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నిత్యన్న ప్రసాదం వడ్డింపుల్లోనూ ప్రతి భక్తుడు తృప్తిగా భోజనం చేసే విధంగా నిత్య అన్నదానం అమలు జరిగేలా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ అన్నప్రసాదాల రుచిని తనిఖీ చేస్తూ భక్తులు అన్న ప్రసాదాల స్వీకరించిన తర్వాత అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి అని తృప్తి చెందే విధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నిత్యాన్నదాన ప్రసాదం స్వయంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు భక్తులతో కలిసి స్వీకరించి అన్న ప్రసాదాల రుచి నాణ్యతలపై అక్కడ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రతిభక్తుడు సంతృప్తికరంగా భోజనం చేసే వెళ్లే విధంగా అన్నప్రసాదాలను తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
No comments:
Post a Comment