శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు కర్నాటి రాంబాబు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు కర్నాటి రాంబాబు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు.వీరికి దక్షిణం గాలిగోపురం వద్ద శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు అనంతరం దక్షిణామూర్తి వద్ద వారికి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, దేవస్థానం అధికారులు ఏఈఓ ధనపాల్, వేద పండితులు మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment