MGM హాస్పిటల్స్ నందు ఘనంగా రథ సప్తమి వేడుకలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు శుక్రవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ పాల్గొన్నారు. డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సూర్యభగవానుని ప్రార్థించానని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ప్రజల ఆరోగ్య దృష్ట్యా అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే ఉద్దేశ్యం తో MGM హాస్పిటల్స్ స్థాపించామని ప్రతీ ఒక్కరూ వారి ఎలాంటి ఆరోగ్య సమస్యలకయినను MGM హాస్పిటల్ కి రావొచ్చని 24 గంటలు హాస్పిటల్ లో డాక్టర్ లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ హాస్పిటల్స్ నందు ఆరోగ్యశ్రీ సేవలు, పలురకాల ఇన్సూరెన్సు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రథ సప్తమి పండుగ సందర్బంగా ప్రతీ ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MGM హాస్పిటల్ మెడికల్ సూపరింటెడెంట్ డాక్టర్ వివేక్ చైతన్య మరియు డాక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment