కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కాపు సంక్షేమ సేన శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పసుపులేటి నవీన్ కుమార్ మరియు కాపు సంక్షేమ సేన శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు అరిగల వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో కొత్తపేటలోని కార్గిల్ సెంటర్ వద్ద శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అంజూరు బాలసుబ్రమణ్యం గారు విచ్చేసి, పట్టణాధ్యక్షుడు నవీన్‌కుమార్‌తో కలసి శ్రీకృష్ణదేవరాయల వారి ఫోటోకు పూలమాలను వేసి జయంతి వేడుకలు ప్రారంభించినారు. తదుపరి అంజూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలనలో వ్యవసాయానికి సంబంధించిన బావులు, చెరువులు, పంట కాలువలు అభివృద్ధి చేసినారు. అదేవిధంగా గుడులు, గోపురాలను కట్టించినారు అని కొనియాడారు. తరువాత పసుపులేటి నవీన్ కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలనలో ఆయన చేసిన మంచి పనులను భావితరాలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలన గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచే దిశగా, అధికారికంగా శ్రీకృష్ణదేవరాల జయంతి వేడుకలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గం అధ్యక్షులు అరిగల వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా విరాజిల్లిందని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన పట్టణ ఉపాధ్యక్షులు కంఠ సుబ్రహ్మణ్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి మునిరాజా, కోశాధికారి తిరుమల, పట్టణ ప్రచార కార్యదర్శి చింతపూడి లోకేష్, కార్య నిర్వాహక కార్యదర్శి అనిల్ బాబు, పట్టణ కార్యదర్శి సాయి సతీష్ కుమార్‌లతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు సిద్ధులు గారి ప్రసాద్, పట్టణాధ్యక్షులు పగడాల ప్రతాప్, పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ కోలా వెంకటేశ్వరరావు మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment