మాతృభాష దినోత్సవం పై అవగాహన సదస్సు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ మహిళ కళాశాలనందు మాతృభాష దినోత్సవం పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా ఆన్ ది మూ ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య అజిత్ జి పాల్గొని మాతృభాష మరియు
విద్యాసంస్థలయందు వ్యక్తిత్వవికాస సదస్సు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆచార్య అజిత్ జి ప్రసంగిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా సేవలు అందజేయాలో, వారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో విద్యార్థుల్లోసృజనాత్మకతను జాగృతిచేస్తూ
విద్యార్థులు రథసారదులై భవిష్యత్తులో రాణించే విధంగా వారి భవిష్యత్తు కార్యాచరణపై , మరియు మాతృభాష యొక్క ఆవశ్యకతపై అవగాహనతెలియజేశారు.ఇండియా ఆన్ ది మూ ఫౌండేషన్ చైర్మన్ ఆచార్య అజిత్ జి,
ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు , చక్రాల ఉష,మాట్లాడుతూ...
మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏవిధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. మన అభివృద్ధికి ఇతర భాషలు నేర్చుకున్న మన భాషను, సంస్కృతి నీ కాపాడుకోవడం, భావితరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం మన అందరి కర్తవ్యంమని ,ప్రతి ఒక్క విద్యార్థి తమ మాతృభాషను సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ , తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకుని రావాలని, దేశభాషలందు తెలుగులేసా అనే పదాన్ని ప్రతి ఒక్క విద్యార్థి స్మరించుకోవాలని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కే.హేమలత, వి. ఉదయలక్ష్మి. కే అనురాధ, టీ శైలజ, వీ శైలజ, బి గార్గీ, కుమారి, గాయత్రి దేవి, వై.భవంతి, నాగ సరోజ లక్ష్మి, తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు
No comments:
Post a Comment