ఉత్తరా దేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా లీకేజీ నియంత్రణకు చర్యలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, February 7, 2024

ఉత్తరా దేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా లీకేజీ నియంత్రణకు చర్యలు

 ఉత్తరా దేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా లీకేజీ నియంత్రణకు చర్యలు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు









స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అతి పురాతనమైన  వాయు లింగేశ్వర దివ్య క్షేత్రా దేవాలయము ఈ దేవాలయంలో గత వర్షాకాలంలో అధిక లీకేజీలను కారణంగా ఈ లీకేజీలు అరికట్టడానికి పూణేకి చెందిన శ్రీమతి ఉత్తరా దేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత బి వెంకటేశ్వరరావు గారు వారి సొంత నిధులతో లీకేజీలకు అరికట్టడానికి చర్యలు చేపట్టారు. పూణేకి చెందిన నిపుణులు కూడా పరిశీలించినారు ఈ పరిశీలనలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో గత వర్షాకాలంలో దేవాలయం లోపల అంతట అధికంగా లీకేజీలు ఏర్పడింది ఆ లీకేజీలు నియంత్రణకు దేవస్థానమే నిధులు మంజూరు చేయాల్సిందిగా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయినప్పటికీ  పార్లమెంట్ సభ్యులు గురుమూర్తిగారు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో పూణేకి చెందిన శ్రీమతి ఉత్తరా దేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల 60 లక్షల సొంత నిధులతో పురాతనమైన దేవాలయాలు కాపాడే పద్ధతిలో కాంక్రీట్ సిస్టం కాకుండా స్పటిక బెల్లం, గళ్ళ సున్నము, కరక్కాయ, శురికి, మెత్తటి ఇసుక వీటి మిశ్రమ తో ఈనెల 18వ తేదీ పనులును ప్రారంభించడం దానికీ కూడా  సిద్ధమయ్యి పూణేకి చెందిన నిపుణులు కూడా పంపించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వారి పరిశీలన కూడా లీకేజీ నియంత్రణకు కావాల్సిన చర్యలు ఏ విధంగా చేపట్టాలని పరిశీలించినారు. అదేవిధంగా గతంలో వారు కూడా అనేక పురాతనమైన దేవాలయాలు కూడా పునరుద్దించినారు కాబట్టి వారికి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలగా లీకేజీ నియంత్రణ పనులు నిలిచిపోతా ఉంటే ఈ యొక్క కార్యక్రమానికి  మునిరత్నం రెడ్డి అనే మిత్రుడు ద్వారా  ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు  బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ లీకేజీలు నియంత్రణ పూర్తి అయితే ఇంకా వంద సంవత్సరాలు వరకు ఎటువంటి లీకేజీలు ఉండదు మన దేవస్థానము కూడా పటిష్టంగా ఉంటుందని అన్నారు. అతి తొందరలోనే కార్యక్రమాన్ని పూర్తిచేసి ఆరు నెలలు కాలంలో పూర్తిగా దేవస్థానం పైభాగం మొత్తం లీకేజీల పనులు జరుగుతాయని తెలిపారు. అందుకు దాదాపు 6 ఇంచులు వేస్ట్ మెటీరియల్ అన్నిటిని కూడా తొలగించి పనులను చేపట్టుతున్నారు. ఈశాన్యంలో పూజలు జరిపి  నైరుతి దిక్కున స్టార్ట్ చేసే విధంగా ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకరత్నమ్మ ఏఈఓ ధనపాల్, ఏఈ శివ కిషోర్, మరియు పూణేకి చెందిన నిపుణులు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad