తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం గురించి సంప్రదాయ దుస్తులతో తెలిపిన సెయింట్ జేవియర్స్ విద్యార్థులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఇందులో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో సంప్రదాయ అలంకరణలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు . అలాగే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, తెలుగు భాష ప్రాధాన్యతను తెలిపే పద్యాలు, గేయాలను ఆలపించారు. అలాగే విద్యార్థులచే ఏకపాత్రాభినయంను అదేవిధంగా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేర్లీ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment