ఐటీ, జిఎస్టీ లు తప్పక ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలని తెలిపిన ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజిఎం గ్రాండ్ సమావేశ గదిలో పట్టణంలోని వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యగోలుతో ఇన్కమ్ టాక్స్ శాఖ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వి. శివ రామ కృష్ణ, తిరుపతి జిల్లా ఇన్కమ్ టాక్స్ అధికారి, సూర్య బాబు నాయక్, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, మల్లికార్జున్, ఆడిటర్, మరియు పట్టణం లోని వివిధ విభాగాల వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగస్థులు... మొదలైనవాలు పాల్గొన్నారు.
అధికారి శివరామకృష్ణ మాట్లాడుతూ... మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రభుత్వం ఇప్పుడు ఎంతో సులభతరంగా చేసింది. మీ ఆడిటర్ల ద్వారా రిటర్న్స్ ప్రభుత్వం చెప్పిన నిబదంలోబడి త్వరత గతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు. కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చింది దాని తగినట్టు ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు సహకరించాలని తెలిపారు
No comments:
Post a Comment