ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాలనందు గుడ్ టచ్ బాడ్ టచ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి లోని ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాలనందు గుడ్ టచ్ బాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రముఖ న్యాయవాదులు ప్రజ్ఞశ్రీ, మరియు గరికపాటి రమేష్.
న్యాయవాదులు ప్రజ్ఞశ్రీ, గరికిపాటి రమేష్ మాట్లాడుతూ..
నేడు విద్యార్థినీలు సమాజంలో తిరిగేటప్పుడు కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థినులను తాకుతూ ఇబ్బందులు పెడుతున్నారని దానిపై విద్యార్థినీలు పాఠశాల నుంచి వారి వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థినిలు సెల్ఫ్ డిజైన్స్ పై అవగాహన పెంచుకోవాలని, .తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని. విద్యార్థినిలు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకునేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలని అన్నారు, కొత్త వ్యక్తులతో ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ఆకతాయిలను అరికట్టడానికి పోలీసులకు సహాయపడతారని, ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు
No comments:
Post a Comment