శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం సందర్బంగా గోడ పత్రికలను ఆవిష్కరణ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 3, 2023

శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం సందర్బంగా గోడ పత్రికలను ఆవిష్కరణ

 శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం సందర్బంగా గోడ పత్రికలను ఆవిష్కరణ





 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధాలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం బ్రహ్మోత్సవముల సందర్బంగా గోడ పత్రికలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఈవో కేవీ సాగర బాబు ఆవిష్కరించారు. ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద గోడపత్రికలకు అర్చకులు, వేద పండితులు పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులుచే ఆవిష్కరింపజేసారు.

 ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు  పాల్గొని విజయవంతం *చేయవలసిందిగా కోరారు.దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు  మాట్లాడుతూ శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం ప్రారంభమవుతుంది  శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో తమ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో రెండో శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికౄర్తిక మహోత్సవం వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు, పాలకమండలి సభ్యులు బుల్లెట్ జై శ్యామ్, సాధన మున్నా, పెద్దిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, కొండూరు సునీత, రమాప్రభ,లక్ష్మి,పసల సుమతి, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు జూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు, దేవస్థాన అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్, లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, దేవస్థాన ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ వేద పండితులు అర్ధగిరి, హేమంత్ శర్మ, పరిచారకులు గోవింద్ శర్మ, పట్టణ ప్రముఖులు కొల్లూరు హరినాథ్ నాయుడు,పాలమంగళం రవి,వెంకటసుబ్బయ్య, లక్ష్మీపతి,బాల గౌడ్,సుధీర్,తేజ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad