ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాళహస్తి నందు తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ఉపాధ్యక్షులు దీన దయాల్ అధ్యక్షత వహించగా ఐక్యూఏసి కోఆర్డినేటర్ మాలతి గేబ్రియల్ , ముఖ్య అతిథులు, తెలుగు శాఖధ్యక్షులు, శ్రీమతి పద్మప్రియ గారి ఆహ్వానం మేరకు వేదిక మీద ఆశీ నులయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు విద్వాన్ గురునాథం , అన్నపూర్ణ విచ్చేశారు. అధ్యక్ష స్థానంలో ఉన్న కళాశాల ఉపాధ్యాయులు దీన దయాల్ తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. అతిథి గురునాధం ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు తెలుగు పద్యమాధుర్యాన్ని, అవధాన కళను గూర్చి విద్యార్థులకు వివరించారు. మరో అతిథి ఆవల కొండ అన్నపూర్ణ ఎన్ని భాషలైనా నేర్చుకోగానీ తెలుగు భాషను మర్చిపోవద్దని విన్నవించారు. తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ పి కుమారి నీరజ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణాన్ని, గిడుగు వారి జీవన ప్రస్థానాన్ని వివరించారు. తెలుగు భాషా వారోత్సవాల్లో భాగంగా 23వ తేదీ నుండి జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. తదనంతరం అధ్యాపకులు అతిధులను దు దుశ్శాలువతో సత్కరించారు. చిరంజీవి దివ్య శిల్ప వందన సమర్పణ అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నరసింహారావు, శ్రీరాములు, పద్మమాలిని పాల్గొన్నారు.
No comments:
Post a Comment