కుమారస్వామి స్వామి వారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు పనులను వేగవంతం చేయండి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 3, 2023

కుమారస్వామి స్వామి వారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు పనులను వేగవంతం చేయండి

 శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు పనులను వేగవంతం చేయండి  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల పనులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.

ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున శ్రీ కుమారస్వామి స్వామి వారి ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగో తేదీ అంకురాపన్న ప్రారంభమవుతుంది 8వ తేదీ భరణి, 9వ తేదీ ఆడికృత్తిక,10 వ తేదీన తెప్పోత్సవం, 11 వ తేదీ స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో వేలాదిమంది భక్తులను పాల్గొంటారు అని తెలియజేశారు ఈ బ్రహ్మోత్సవాలలో భక్తుల కోసం ఏర్పాటు చేసే పనులను వేగవంతకం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.విజ్ఞానగిరి చుట్టూ పిచ్చి మొక్కలన్నిటిని దేవస్థానం పారిశుధ్యం సిబ్బంది శుభ్రం చేశారని అన్నారు.పారిశుధ్యం సిబ్బందినీ అభినందనలు తెలిపారు. ఇంజనీర్ అధికారులకు వెంటనే ఆలయంలో పెయింటింగ్ వర్క్స్, అదేవిధంగా గత ఏడాది ఏర్పాటుచేసిన విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయాలని ఇంజనీర్స్ అధికారులకు సూచించారు విఐపి లకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా తెప్పోత్సవం ఉత్సవాలు నవ్వించే కోనేరును పరిశీలించి  కోనేరు శుభ్రం చేయించి నీటిమట్టన్ని పెంచాలని ఇంజనీర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, ఇంజనీర్ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ, చైర్మన్ సీసీ సుదర్శన్ రెడ్డి, మరియు పట్టణ ప్రముఖులు కొల్లూరు హరినాథ్ నాయుడు, జలకం కిషోర్, బాల గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad