ది స్కూల్ లో మాతృ భాష దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తెలుగుదనం లోని గొప్పదనాన్ని తెలుసుకోవాలని, ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మ భాషను మరవకూడదని ద స్కూల్ హెడ్ మిస్ట్రెస్ పి.విశాల అన్నారు. ది స్కూల్లో ఏర్పాటు చేసిన మాతృ భాష దినోత్సవం లో ఆమె మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటూనే , తెలుగు ప్రాభవాన్ని కొనసాగించాలన్నారు. విద్యార్ధులచే అనంతరం ఏర్పాటు చేసిన ప్రసంగాలు, నాట్యాలు ఎంతగానో ఆకట్టకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment