భారాలపై ఉద్యమిద్దాం :సిపిఎం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30 తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు సిపిఎం వివిధ రూపాల్లో చేపట్టబోయే ప్రజా ఉద్యమ కరపత్రాలను స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో మంగళవారం ఆవిష్కరించారు. మోడీ పాలనలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మోడీ, జగన్ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 30 నుండి ప్రచారం, సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1న గ్రామ/వార్డు సచివాలయాలకు విజ్ఞాపన పత్రాల సమర్షణ, సెప్టెంబరు 3న నిరుద్యోగ వ్యతిరేక దినం నిర్వహించి, సెప్టెంబరు 4న మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. గంధం మణి, పెనగడం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment