మమ్మల్నీ రెగ్యులర్ చేయండి సార్.. కాంట్రాక్టు టీచర్స్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, August 30, 2023

మమ్మల్నీ రెగ్యులర్ చేయండి సార్.. కాంట్రాక్టు టీచర్స్

 మమ్మల్నీ రెగ్యులర్ చేయండి సార్.. కాంట్రాక్టు టీచర్స్ 

 

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


    సాంఘీక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులను  రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏపీ రెసిడెన్షియల్ కాంట్రాక్ట్ టీచర్స్ ఫెడరేషన్  నాయకులు ఆ శాఖా మంత్రి మేరుగ నాగార్జునకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని కాసాగార్డెన్ బాలికల గురుకులం పర్యటనకు మంగళవారం సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి రాగా కాంట్రాక్టు టీచర్లు ఆయన్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 793 మంది కాంట్రాక్టు టీచర్లు దాదాపు 16 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తమను సొసైటీ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించారనీ, ప్రస్తుతం దాన్నే సాకుగా చూపి రెగ్యులర్ చేయకుండా మోకాలడ్డడం అన్యాయమని వాపోయారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2002-2006 వరకు కాంట్రాక్టు పరిధిలో పనిచేసిన ఉపాధ్యాయులను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014కు ముందు నుండి ఇప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ హామీ ఇచ్చారనీ, ఆ జాబితాలో సాంఘిక సంక్షేమ శాఖా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను చేర్చకపోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సొసైటీ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను అక్కడి సీఎం కేసీఆర్ రెగ్యులర్ చేశారనీ, ఏపీలో అందుకు భిన్నంగా సొసైటీని సాకుగా చూపి కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేయడం భావ్యం కాదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను సైతం క్రమబద్ధీకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు.

 * కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించండి

 సాంఘిక సంక్షేమ శాఖా సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్ చేయాలంటూ ఓ వైపు ఏపీ రెసిడెన్షియల్ కాంట్రాక్ట్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు పక్క ఆ శాఖ మంత్రి మేరుగ నాగార్జునకు వినతి పత్రం అందజేశారు. అదే శాఖలో పార్ట్ టైం టీచర్లుగా పనిచేస్తున్న తమను కాంట్రాక్టు పరిధిలోకి తీసుకోవాలంటూ, ఉద్యోగ భద్రత కల్పించాలంని ఇంకోవైపు ఏపీ రెసిడెన్షియల్ పార్ట్ టైం టీచర్ ఫెడరేషన్ నాయకులు కూడా ఆ శాఖ మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో ఖాళీ అయ్యే స్థానాలకు పార్ట్ టైం టీచర్లను బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1800 మంది పార్ట్ టైం టీచర్లను కాంట్రాక్ట్ పరిధిలోకి తీసుకుంటూ అవసరమైతే బాలుర రెసిడెన్షియల్ గురుకులాల్లో సైతం  పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad