శ్రీ డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు -వేడం కృష్ణయ్య, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తొట్టంబేడు మండలంలోని చియ్యవరం శక్తీ కేంద్ర పరిధిలో మండల కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు కోలా ఆనంద్ ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారత రాజనీతిజ్ఞాలలో అగ్రగణ్యుడు, గొప్ప విద్యావేత్త, మహోన్నత దేశ భక్తి కలిగి దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలను దేశం కోసం అర్పించిన డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్రను దేశంలోని ప్రతి యువత ఆదర్శంగా తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ తన మాతృ భూమి సేవలో నిజమైన యోధుడిగా కాశ్మీర్ విలీనం కోసం 23. 06. 1953 తేదీన బలిదానం అయ్యారు. అటువంటి దానిని మన ప్రియతమా ప్రధాని నరేంద్రమోదీ గారి యొక్క ప్రభుత్వం 370 వ ఆర్టికల్ ని రద్దు చేసి, ముఖర్జీకి శ్రీ నరేంద్రమోదీ గారు నిజమైన ఘన నివాళులు అర్పించారని ఈ సందర్భంగా నరేంద్రమోదీ గారిని కోలా ఆనంద్ కొనియాడారు. తదుపరి పిల్లలకు పండ్లు, స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్, కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షులు వేడం కృష్ణయ్య, ఏర్పేడు మండల ఇంచార్జ్ కుప్ప ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి కందాటి మునిరాజ, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు కె. వెంకటేష్, ఉపాధ్యక్షులు చొక్కాని రవిచంద్ర, సీనియర్ లీడర్ వై. గురప్ప, ఓబీసీమోర్ఛా నాయకులు చిత్తి కాటు బాలాజీ, కిసాన్ మోర్ఛా అధ్యక్షులు కె. రాజనేల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment