ముత్యాలమ్మ తల్లికి కేజీ 300 గ్రాముల వెండి కలశం బహూకరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి స్థానికులు గోపికృష్ణ హోటల్ యజమాని గోపాల్ రెడ్డి దంపతులు కేజీ 300 గ్రాముల వెండితో లక్ష 15 వేల రూపాయలు వెచ్చించి వెండి కలశాన్ని తయారు చేయించారు. శుక్రవారం ముత్యాలమ్మ తల్లికి వెండి కలశాన్ని అందజేశారు. దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో దాతలు వెండి కలశాన్ని అమ్మవారికి సమర్పించారు. దాతలను చైర్మన్ అభినందించి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఆలయాలు అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి విరివిరిగా విరాళాలు అందిస్తూ సహకారం అందించడం అభినందనీయమని చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బండారు పరమేశ్వర స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ జయ హరి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment