చిందేపల్లి ఎస్టీ కాలనీ లో ఉన్న పిల్లలకు విధ్యాసామాగ్రి,కొత్త దుస్తులు పంపిణీ:అధ్యక్షులు మునిశేఖర్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయంత్రం పూట బడులలో చదువుతున్న ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ పిల్లలకు దాతలు
సహాయంతో ఒక జత బట్టలు, బుక్కులు, పలక, బలపం పాకెట్, పెన్ను, పెన్సిల్, మెండేర్, రబ్బరు, జడ రిబ్బన్, మరియు దువ్వెన చిందేపల్లి సర్పంచ్ పెంచులయ్య గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి యువనేస్తం అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.గిరిజన పిల్లలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ పెచులయ్య మాట్లాడుతూ యువనేస్తం అసోసియేషన్ వారు చేస్తున్న సేవలు అభినందయమని వారు ఎంతోమంది పేదవారికి సహయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చెంచురెడ్డి. ఈశ్వరయ్య,.యువనేస్తం అసోసియేషన్ మండల కో ఆర్డినేటర్ లు అరుణ.నాగమణి,మరియు వాలంట్రీలు లక్ష్మీ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment