శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భారత ప్రభుత్వం అదనపు కార్యదర్శి (సాంస్కృతిక) శ్రీమతి కి. రాజన్ చోప్రా జీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత *శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమైభారత ప్రభుత్వం అదనపు కార్యదర్శి (సాంస్కృతిక) శ్రీమతి కి. రాజన్ చోప్రా జీ ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన్నారు.వారికి శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం అధికారులు స్వాగతం పలికి అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనంఅనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వారిని శేషవస్త్రంతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు అనంతరం దేవాలయంలో వర్షం కారణంగా గుడి మొత్తం లీకేజీ అదనపు కార్యదర్శి (సాంస్కృతిక) శ్రీమతి కి. రాజన్ చోప్రాజీ గారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వినతి పత్రం అందించారు. స్పందించి వీలైతే త్వరలో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయము ప్రతిరోజూ నిర్వహించే రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భారీ వర్షం కారణంగా గుడి మొత్తం లీకేజీ అవుతుందని, లీకేజీల నివారణకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పును పరిశీలించి రూ.3.5కోట్ల భారీ వ్యయంతో రూ.3.5కోట్ల వ్యయంతో ఆలయానికి అధిక భారం పడుతుందని ఆలయాన్ని రక్షించడానికి మరియు భక్తులకు మరియు యాత్రికులకు సహాయం చేసే ఉద్దేశ్యంతో ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు,శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి, ఆలయ అధికారులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దాము,వేద పండితులు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment