శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి నితిన్ గడ్కరి సతీమణి కాంచన గడ్కరి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సతీమణి కాంచన గడ్కరి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మేధా గురుస్వామి మూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవారి తీర్థప్రసాదాల్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సతీష్ మల్లికార్జున్, పి.ఆర్.ఓ వెంకట్ స్వామి, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment