శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు లక్షల రూపాయలు విరాళం అందజేశారు - శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు బాపట్ల వాస్తవ్యులు దామెర్ల శ్రీధర్ గారు వాళ్ల కుమార్తె దామెర్ల దీపిక మరియు కుమారుడు దామెర్ల శ్రీకర్ పేరుపైన (లక్షల రూపాయలు ) 1,00,000/- శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారుధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదని తెలియజేశారు స్వామి* అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటుచేసిన నిత్య అన్నదానానికి విరాళాలను అందజేసిన దామెర్ల శ్రీధర్ మరియు కుటుంబ సభ్యులుకి తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నానువారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి* స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు వెంకటరమణ నాయుడు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment