అవగాహణతోనే ఎయిడ్స్ వ్యాధి ని నివారించేందుకు ముందుకు పోవాలని పిలుపునిచ్చిన స్టెప్స్ సంస్థ డాక్టర్ ప్రమీలమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ ఎయిడ్స్ నిర్ముల దినోత్సవము భాగముగా చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణం లోని స్టెప్స్ సంస్థ కార్యాలయంలో 'ఎయిడ్స్ నిర్ములన పై అవగాహనా కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమమునకు స్టెప్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలమ్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్, రెడ్డి , ప్రభుత్వ వైద్యశాల ఐ సి ఐ సి కౌన్సిలర్ భారతి, స్టెప్స్ ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్, భాస్కర్ ...మొదలైనవాలు లు పాల్గొన్నారు.
డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ.... ఎయిడ్స్ వ్యాధి అరికట్టడానికి అవగాహనతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలలో పూర్తిస్థాయి చైతన్యం కలిగినప్పుడే వ్యాధి బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఎయిడ్స్ మహమ్మారికి ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత ఆసరానిస్తున్నాయనీ, ఫలితంగానే ఎయిడ్స్ మరింత విజృంభిస్తోందని అన్నారు.
భారతి మాట్లాడుతూ... జిల్లాలో వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాగన కలిగించడానికి " ప్రపంచ ఆరోగ్య సంస్థ " సూచనల మేరకు 1988 నుంచి డిసెంబర్ 01 న " ప్రపంచ ఎయిడ్స్ దినం " గా పాటించడం జరుగుతోంది . 1981 జూన్ 5 వ తేదీన మొదటిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ నేడు ప్రపంచ వ్యాప్తము గా 3.8 కోట్ల మందికి సోకింది . ఇండియాలో మొదటిసారిగా 1986 లో ఎయిడ్స్ ను గుర్తించారు . . భారతదేశము లో " నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం " అనేది 1987 లో మొదలైనది
భారత్‌లో కూడా ఎయిడ్స్ రోగుల సంఖ్య 5.70 నుంచి 2.56 కోట్లకు తగ్గినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి సంస్థ (నాకో) ప్రకటించింది. దీనికంతటికీ కారణం.. ప్రభుత్వాలు, ప్రైవేట్, స్వచ్ఛంధ సంస్థలు చేపడుతున్న విస్తృత ప్రచారం కారణంగా ఎయిడ్స్‌పై అవగాహన పెరుగుతోంది.
No comments:
Post a Comment