తల్లి తండ్రులకు అవగాహన తోనే బాల్యవివాహాలు నిర్ములించాలని న్యాయవాది రాజేశ్వరరావు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 25th నవంబర్ నుండి 10th డిసెంబర్ వరకు మహిళలు, పిల్లల పట్ల లింగ వివక్షత నిర్మూలించాలి అనే ఉద్దేశంతో దాని కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణం లో బాల్య వివాహాలు అరికట్టాలని ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బంది కి అవగాహన సదస్సు , ర్యాలీ నిర్వహించడం జరిగింది
.ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతి దుర్గ, న్యాయవాది రాజేశ్వరరావు,ఎంఈఓ భువనేశ్వరి, ఏ పి ఎం మునెయ్య మరియు అంగన్వాడి టీచర్లు, సిడిపిఓ సూపర్వైజర్లు , సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు.... మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ..... ప్రతి ఒక్కరు లింగ వివక్ష చూపకండా పిల్లలను పెంచాలని , బాల్యవివాహాలు అరికట్టాలని తెలిపారు .
MEO భువనేశ్వరి మాట్లాడుతూ..... పిల్లల పెంపకం పట్ల తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
APM మునెయ్య మాట్లాడుతూ.... మహిళ సంఘాల మహిళలను పెద్ద ఎత్తున కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని తెలిపారు.
సీడీపీఓ శాంతి దుర్గ మాట్లాడుతూ.... లింగ వివక్ష , లైంగిక నేరాలు, బాల్యవివాహాలు తగ్గాలి అంటే యుక్త వయస్సు బాల ,బాలికలకు ప్రత్యేక ఆవాహన సదస్సు లు నిర్వహించి , తల్లి తండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.దీని కోసం ప్రతి ఒక్క కార్యకర్త గ్రామoలో పని చేయాలని తెలిపారు.
No comments:
Post a Comment