శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులతో ప్రత్యేక సమావేశము
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులతో శ్రీకాళహస్తి పురపాలక సంఘము నందు మునిసిపల్ కమీషనర్ శ్రీ బి. బాలాజీ నాయక్ ప్రత్యేక సమావేశము ఎర్పాటు చేయడం జరిగింది. సదరు సమావేశము ఉదేశించి కమీషనర్ బి. బాలాజీ నాయక్ మాట్లాడుతూ
1. ప్రతి 3 నెలకు ఒకసారి నీళ్లని ల్యాబ్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఉంచుకోవలెను.
2. వాటర్ ప్లాంట్ పరిసర ప్రాంతాలని పరిశుభ్రతగా ఉంచుకోవలెను.
3. ఫుడ్ శాంపిల్ లైసెన్సు మరియు ట్రేడ్ లైసెన్సును తప్పకుండ తీసుకోనవలెను .
4. ప్రతి వాటర్ ప్లాంట్ నందు ఇంకుడు గుంత ఏర్పాటు చేయవలెను .
5. వాటర్ కంఠన్మెంట్ లేకుండా తగు చర్యలు తీసుకోవలెను.
పై నిబంధనలను వాటర్ ప్లాంట్ యజమానులు తప్పకుండ పాటించవలెను, అట్లు పాటించని వారి పై ప్రభుత్వ నియమనిబంధనలు మేరకు చర్యలు తీసుకునబడునని తెలియజేయడమైనది.
No comments:
Post a Comment