75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పరిపాలన భవనం వద్ద గణతంత్ర
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దినోత్సవ కార్యక్రమాని ధర్మకర్తల మండల అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం డిప్యూటీ ఈ.వో వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం దేవస్థానం నందు పనిచేసే పోలీసులు పెరేడ్ ప్రోగ్రాం నిర్వహించి గౌరవ వందనం తెలియజేశారు. అనంతరం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
ఈ సందర్భంగా అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ,భారతదేశ స్వాతంత్రం కోసం అమరవీరులైన స్వతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,సిబ్బంది,మరియు ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment