శ్రీకాళహస్తిలోని పలు నాగశిలలు వద్ద నాగల చవితి వేడుక
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలోని పలు నాగశిలలు వద్ద నాగల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించుకుంటున్నారు. నాగ శిలలు కు పాలు తో విశేష అభిషేక పూజలు చేసి, పూజా ద్రవ్యాలు సమర్పిస్తున్నారు.
శేషుడి ఆరాధనకు భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. నాగ దోషాల నుంచి విముక్తి లభించి సకల కుటుంబాలు సుఖశాంతులతో ఉండేందుకు నాగల చవితి నాడు నాగ శిలలు, నాగ పుట్టలకు విశేష పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం, చవితి ఘడియలు ఉండడంతో నాగుల చవితి వేడుకలను సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని తిరుమంజనం గోపురం వద్ద ఉన్న నాగశిలలు వద్ద విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు. మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో విచ్చేసి నాగశిలలకు పాలు పోసి, పూజా ద్రవ్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాగ పుట్టలు వద్ద స్థానికులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. నాగశిలలు, నాగ పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దీపాలు వెలిగించి నాగేంద్రుడికి వివిధ రకాల పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ పూజలు జరుపుకుంటున్నారు. పుట్టల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు, బోర్డు మెంబర్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment