కమిషనరు ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో స్వచ్ఛత హి సేవ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలోని కాసాగార్దేన్ (ETC) సెంటర్ నుండి బైపాస్ ఆర్చి వరకు ఆదివారము అనగా తేది:01.10.2023 న కమిషనరు ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకముగా చేపట్టిన "స్వచ్ఛత హి సేవ" కార్యక్రమము లో భాగముగా " ఏక్ గంట - ఏక్ తారీఖ్" నిర్వహించడము జరిగినది. సదరు కార్యక్రమమును ఉద్దేశించి మునిసిపల్ కమిషనరు ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ మనము ఆరోగ్యముగా జీవించాలంటే పరిసరాలు పరిశుభ్రముగా ఉంచుకోవాలని మరియు ప్రతి ఒక్క వార్డు నందు ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించి పరిశుభ్రముగా ఉంచాలని కోరుతూ కాసాగార్దేన్ (ETC) సెంటర్ నుండి బైపాస్ ఆర్చి వరకు రోడ్డుకి ఇరువైపులా వున్న ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించడము జరిగినది. రోడ్డు డివైడర్ నందు వున్న గడ్డి మరియు చెత్తా, చెదారాలను తొలగించడము జరిగినది.
పై కార్యక్రమము నందలి ఆర్ . లలితా (DE), వి. సాయి సింధు (AEE) , శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇ. శ్రీనివాసులు, యన్.బాలక్రిష్ణ, పి.రవికాంత్ (RI ), పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment