ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులు వేగవంతం చేయండి -జాయింట్ డైరెక్టరు డాక్టర్ సరళమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఏపీ వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టరు డాక్టర్ సరళమ్మ ఆదేశించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాడు-నేడు కింద జరుగుతున్న విస్తరణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సరళమ్మ మాట్లాడుతూ... ఆస్పత్రి విస్తరణ పనుల్లో జాప్యం చోటు చేసుకోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇంజనీరింగ్ విభాగం వారు జోక్యం చేసుకుని విస్తరణ పనులు సత్వరంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో పలు వార్డులను పరిశీలించారు. అదేవిధంగా రికార్డులు పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమె వెంట ఇన్ ఛార్జి ఆర్ ఎంవో డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment