కమిషనరు రమేష్ బాబు గారి ఆధ్వర్యములో గాంధీ జయంతి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనరు ఎం. రమేష్ బాబు గారి ఆధ్వర్యములో సోమవారము 02.10.2023 న జాతిపిత "గాంధీ జయంతి" కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మునిసిపల్ కమిషనరు శ్రీ ఎం. రమేష్ బాబు గారు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యమును సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ ఉద్యమంలో సత్యము - అహింస అనే ఆయుధాలతో స్వాతంత్య్రాన్ని సాధించారని కొనియాడారు.
ఈ కార్యక్రముము నందు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. లలిత, సీనియర్ అసిస్టెంట్లు ఎం. సురేష్, వంశీ కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ అహ్మద్, దివ్య హాసిని, శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment