శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశదీపం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్ర యుక్తంగా ఆవిష్కరించారు. ఆలయ సూపర్డెంట్ నాగభూషణం ,ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు.
కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసం లో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆలయ సూపర్డెంట్,నాగభూషణం,ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్ర యుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజలు అనంతరం భక్తుల శివ నామస్మరణల నడుమ వేదో యుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment