పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హైకోర్టు మరియు జిల్లా లీగల్ సర్వీస్ కమిటీ ఆదేశాల మేరకు స్వచ్ఛభారత్ దివాస్ లో భాగంగా ఈరోజు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం శ్రీకాళహస్తి కోర్ట్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియ, న్యాయవాదులు పారా లీగల్ వాలంటరీలు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా కోర్ట్ ఆవరణ లోని గదులను, బాత్రూంలను, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. తర్వాత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
న్యాయమూర్తులు మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత మన కుటుంబ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కావున ప్రతి ఒక్కరు మన చుట్టుపక్కల పరిశుభ్రత గా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు.
ఈరోజు సీనియర్ సిటిజెన్స్ దినోత్సవం సందర్భంగా లోబాయి పోయే దారిలో ఉన్న వృద్ధాశ్రమంలో సందర్శించారు. పరిసరాల శుభ్రత పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జునయ్య, రాజేశ్వరరావు, అరుణ్, పారా లీగల్ వాలంటరీ. మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment