ఆకస్మిక పరిశీలన చేసిన న్యాయవాదులు, పార లీగల్ వాలంటరీలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వెనుకవైపున ఉమెన్ హాస్టల్ ను విద్యార్థినిల తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలన చేయడం జరిగింది. అనంతరం అక్కడ బాలికలకు భోజన, నీటి వసతి పై అరా తీశారు. విద్యార్థులకు పెట్టె భోజనం రుచి చూసారు. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ లేదని వారికి భద్రత లేదని చూసి వారు చాలా విచారం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. దీని వల్ల పందులు వచేస్తున్నాయి అన్నారు. గత లో అనగా సంవత్సరం ముందు గౌరవ సీనియర్ సివిల్ జడ్జి పరిశీలించిన తర్వాత ఇపుడు ఏమి మార్పులేదని అసహనం వెక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులకు తెలుపుతామనారు
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రజ్ఞశ్రీ రాజేశ్వరరావు గరికపాటి రమేష్, పారా లీగల్ వాలంటరీ లు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ.... విద్యార్థినిలకు ఉడికి ,ఉడకని అన్నం పెడుతున్నారని అన్నారు. అలాగే కాంపౌండ్ లోపల పందుల వీర విహారం జరుగుతుందని, దీనివల్ల విద్యార్థులకు అనారోగ్య పాల వ్వచ్చు అని తెలిపారు, అలాగే చుట్టుపక్కల యువకులు అసాంఘిక కార్యకలాపాలు చేసి కాంపౌండ్ లేని నందున లోపలికి చొరబడిన సంఘటనలు కూడా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్న కాంపౌండ్ వాల్ ప్రభుత్వం కట్టలేక పోతుందని తెలిపారు. అలాగే విద్యార్థిని బాత్ రూములకు తలుపులు కూడా లేదని అన్నారు పై సమస్యలన్నీ గౌరవ సీనియర్ సివిల్ జడ్జికు తెలిపి,పై సమస్య పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని తెలిపారు
No comments:
Post a Comment