ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు MGM హాస్పిటల్స్ సంయుక్తం గా ఆరోగ్య అవగాహనా కార్యక్రమం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం లో మంగళవారం రోజున డిగ్రీ చదివే విద్యార్ధినులకు ఆరోగ్యం పై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విద్యార్ధినులకు ఋతు క్రమ సమయంలో వచ్చే సమస్యలు మరియు పరిశుభ్రత గురించి MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మి ప్రసన్న అవగాహన కల్పించారు. విద్యార్ధినులు అడిగే వారి సమస్యలకు పూర్తి వివరణ ఇస్తూ చైతన్యం చేసారు. అలాగే డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు యుక్త వయస్సులో ఆరోగ్యం జాగ్రత్తలు గురించి తెలియజేసారు. అలాగే శ్రీకాళహస్తి మహిళా కాలేజీ ఉపాధ్యాయినిలు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. విద్యార్ధినులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి, MGM హాస్పిటల్స్ యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపాల్ ధన్యవాదములు తెలిపారు.








No comments:
Post a Comment