భాష్యం పాఠశాల యందు ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
స్థానిక శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డు సమీపంలోని భాష ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు సోమవారం గణిత శాస్త్రవేత్త శ్రీ రామాను సుఖం గారి జయంతి సందర్భంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ రామకృష్ణ గారి " మార్గ దర్శకత్వంలో. Z.E.O శ్రీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి.ఈ కార్య క్రమంలో భాగంగ ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ దామోధరం గారు విద్యార్థులకు గణిత శాస్త్రంలోని మెళుకువలను క్షుర్దంగా వివరించారు. తదనంతరం భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. మహేష్ గారు మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవ మొక్క అవగాహనను తెలయజేస్తు, గణిత శాస్త్రం లోని సమస్యల పరిష్కారంతో సరి పోలుస్తు విద్యార్థుల నిజ జీవితంలోని సమస్యలను ఎలా అధిగమించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని హెచ్. ఎమ్. షమీత్రు , గణిత అధ్యాపకులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.










No comments:
Post a Comment